జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర చేతుల మీదుగా ఆవిష్కరణ
హైదరాబాద్: జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వంలో ‘నమో జయం ప్రొడక్షన్స్’ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘జయంత్ అండ్ ది జింగోపెన్’ (Jayannth & the JINGO PEN). దివ్య ప్రవీణ్ బొలిశెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రంలో జయంత్ టైటిల్ పాత్రలో నటిస్తుండగా.. తనికెళ్ల భరణి, సత్యం రాజేష్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టీచర్స్ డే సందర్భంగా చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత మారం పవిత్ర ఆవిష్కరించారు. పాఠశాల విద్య, విద్యార్థులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ప్రస్తుత విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలను కుటుంబ భావోద్వేగాలతో మేళవించి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

విద్యార్థుల సవాళ్లే కథాంశం
హీరో జయంత్ మాట్లాడుతూ.. పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కొనే సమస్యలు, నేటి విద్యావ్యవస్థలోని మార్పులు, పరిణామాలను ప్రతిబింబించే కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందన్నారు. ఇది సరికొత్త తరహా ప్రయోగమని, ప్రేక్షకులకు భిన్నమైన అనుభూతిని అందించేలా సినిమా ఉంటుందని చెప్పారు.
‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ ఆధారంగా..
దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ.. 32 అవార్డులతో పాటు జాతీయ అవార్డు, ఫిలింఫేర్ అవార్డులు అందుకున్న ‘లతా భగవాన్ ఖరే’ తర్వాత తాను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇదేనన్నారు. మలయాళంలో 111 రోజుల పాటు ప్రదర్శితమై విజయవంతమైన ‘ఫిలిప్ అండ్ ది మంకీ పెన్’ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని తెలుగు నేటివిటీకి అనుగుణంగా ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు తెలిపారు.
కుటుంబ అనుబంధాలు, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో పాటు విద్యావ్యవస్థకు సంబంధించిన అంశాలకు చిత్రంలో ప్రాధాన్యం ఇచ్చామని, తెలుగు ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

ఉపాధ్యాయుడి పాత్రలో సత్యం రాజేష్
నటుడు సత్యం రాజేష్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా, జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత చేతుల మీదుగా తాను ఉపాధ్యాయుడిగా నటించిన సినిమా ఫస్ట్ లుక్ విడుదల కావడం ఆనందంగా, గర్వంగా ఉందన్నారు. మంచి కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు.
పాఠశాలే దేవాలయం
నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి మాట్లాడుతూ.. తన దృష్టిలో పాఠశాల ఒక దేవాలయమని, ఉపాధ్యాయులే అందులో దేవుళ్లని అన్నారు. అందుకే సినిమా ప్రమోషన్లను కూడా పాఠశాల నుంచే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రవీణ్ బొలిశెట్టితో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం గర్వంగా ఉందని, ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను రూపొందిస్తున్నామని చెప్పారు.
ఈ చిత్రంలో జయంత్, తనికెళ్ల భరణి, సత్యం రాజేష్, మానస రాధాకృష్ణన్, ఆశిష్ గాంధీ, కాశీ విశ్వనాథ్ తదితరులు నటిస్తున్నారు.
సాంకేతిక బృందం:
సంగీతం: మోహిత్ కులకర్ణి | ఛాయాగ్రహణం: ఆండ్రూ బాబు | కథనం, మాటలు, పాటలు: ప్రవీణ్ బొలిశెట్టి | ఎడిటింగ్: నందమూరి హరి తారక రామారావు | ఆర్ట్ డైరెక్షన్: నాని | నిర్మాత: దివ్య ప్రవీణ్ బొలిశెట్టి | దర్శకత్వం: నవీన్ దేశబోయిన


- ప్రవాస తెలుగు పిల్లలకు సులభమైన బోధనా విధానం
- మాతృభాష, సంస్కృతిని చేరువ చేసే లక్ష్యం
- పిల్లలకు సులభమైన బోధనా విధానం
- ఆసక్తి చూపుతోన్న ప్రవాస తెలుగు కుటుంబాలు
- సెప్టెంబర్ 30 వరకు అడ్మిషన్ల గడువు
