సెమీ ఫైనల్‌కు జిల్లా సాఫ్ట్‌బాల్ జట్టు
NEWS Sep 12,2026 10:55 pm
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో 11వ తెలంగాణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ సాప్ట్ బాల్ ఛాంపియన్షిప్ 2026-27 పోటీలు గత 2 రోజులుగా జరుగుతున్నాయి. శనివారం జరిగిన సాప్ట్ బాల్ టోర్నమెంట్లో జగిత్యాల జిల్లా బాలుర సాప్ట్ బాల్ జట్టు హైదరాబాద్ జట్టుతో క్వార్టర్ ఫైనల్లో పోటీ పడి 1-0 తేడాతో గెలుపొందింది. నేడు నిజామాబాద్ జట్టుతో సెమీ ఫైనల్ లో తలపడనుంది. ఈ సందర్భంగా క్వార్టర్ ఫైనల్లో గెలుపొంది సెమీ ఫైనల్ చేరిన జట్టు క్రీడాకారులను జిల్లా అధ్యక్షుడు కసనగొట్టు మనోహర్, కార్యదర్శి వెంకటేష్, ప్రశాంత్ , రాజేష్, గౌతమ్ తదితరులు అభినందించారు.