వన్డేల్లో కోహ్లీ అరుదైన రికార్డు!
NEWS Nov 04,2026 11:03 pm
కోహ్లీ వన్డే క్రికెట్‌లో మరో అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ 13 వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో ఆక్లాండ్‌లో జరిగిన తొలి వన్డేలో ఈ మైలురాయిని అందుకున్నాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ 12,662 పరుగులతో 2వ స్థానంలో ఉండగా, కుమార సంగక్కర 9,747 పరుగులతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. జాక్వెస్ కలిస్, కేన్ విలియమ్సన్, బాబర్ ఆజమ్, జో రూట్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. మరోవైపు, రెండో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ సచిన్ 13,685 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.