నవంబర్ 22న భారత్–పాక్ సమరం
NEWS Nov 02,2026 08:06 pm
ఖతార్ వేదికగా నవంబర్ 19 నుంచి 29 వరకు జరగనున్న రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు భారత ‘ఎ’ జట్టును బీసీసీఐ ప్రకటించింది. 15 మంది సభ్యుల జట్టుకు తెలుగు తేజం తిలక్ వర్మ కెప్టెన్‌గా, రజత్ పటీదార్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అభిషేక్ శర్మ, హర్షిత్ రాణా, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనున్న భారత్, 22న పాకిస్థాన్‌తో తలపడనుంది. 24న యూఏఈతో గ్రూప్ మ్యాచ్ ఆడనుంది. నవంబర్ 29న ఫైనల్ జరగనుంది.