అభి‘షేకింగ్’ చరిత్ర సృష్టించిన టీమిండియా!
NEWS Oct 27,2026 05:24 pm
న్యూజిలాండ్‌తో మూడో టీ20లో భారత బ్యాటర్లు విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగారు. అభిషేక్ శర్మ 38 బంతుల్లో 113 పరుగులు చేయగా, వైభవ్ సూర్యవంశీ 19 బంతుల్లో 45 పరుగులతో మెరిశాడు. దీంతో భారత్ కేవలం ఐదు ఓవర్లలోనే 100 పరుగులు దాటింది. పవర్‌ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 118 పరుగులు చేసి పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పవర్‌ప్లే స్కోరు రికార్డు సాధించింది. 10 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.