www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

జగన్నాథ్‌పూర్‌లో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

Share:
128 Views
జగన్నాథ్‌పూర్‌లో చేయూత పెన్షన్ పత్రాల పంపిణీ

జగన్నాథ్‌పూర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న చేయూత పథకంలో భాగంగా గ్రామంలోని అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎంపీడీఓ చిరంజీవి ఆదేశాల మేరకు గ్రామ సర్పంచ్ పరాచ శంకర్ లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామ కార్యదర్శి జి. మౌనిక, కార్బార్ రమ్య, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ భగవంత్ రావ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.