www.breakingnow.app | Wed, 18 Nov 2026
LATEST NEWS Andhra Pradesh, Prakasam

నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు

Share:
128 Views
నిర్మాత బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు

చెక్‌ బౌన్స్‌ కేసులో సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. రూ.95 లక్షల జరిమానా కూడా చెల్లించాలని ఆదేశించింది. 2018లో ప్రకాశం జిల్లా మద్దిరాలపాడుకు చెందిన జానకి రామయ్య వద్ద ఆయన రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అనంతరం జానకి రామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లుకు ‘పరమేశ్వర ఆర్ట్స్‌ ప్రొడక్షన్‌’ పేరుతో చెక్‌ ఇచ్చారు. అది బౌన్స్‌ కావడంతో బాధితుడు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఖర్చులు కూడా చెల్లించాలని ఆదేశించిన కోర్టు, తీర్పుపై అప్పీల్‌ చేసుకునేందుకు నెల రోజుల గడువు ఇచ్చింది. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని బండ్ల గణేశ్‌ స్పందించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.