అపురూప చరిత్రకు 11 వసంతాలు!
NEWS Jun 01,2025 11:59 pm
చీకట్లను చీల్చుకుంటూ.. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పదకొండేళ్లకాలం పూర్తయింది! 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. ప్రతి ఒక్కరికీ చరిత్రలో పాత్ర, విజయంలో భాగం కల్పించినది తెలంగాణ ఉద్యమమొక్కటే. తెలంగాణ ప్రజల కండ్లల్ల కొత్త వెలుగు నిండిన సందర్భం. ప్రపంచ ప్రజా ఉద్యమాల సరసన తెలంగాణ ఉద్యమాన్ని నిలిపిన అసలు సిసలు ప్రజా విప్లవం ఇది.