దుబాయ్ బంగారు ఆభరణాల రంగంలో మరో ప్రత్యేక ఘనత సాధించింది. జోయాలుక్కాస్ రూపొందించిన ‘మయూర సహస్ర’ పేరుతో ఉన్న ఝుంకా చెవిపోగుల జతకు 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులు లభించాయి. 22 క్యారెట్ల బంగారంతో తయారైన ఈ జత 16.514 కిలోలు. ప్రపంచంలోనే అత్యంత బరువైన, అతిపెద్ద చెవిపోగుల జతగా గుర్తింపు పొందింది. 2026 అక్టోబర్ 24న UAE మంత్రి బిన్ తౌక్ అల్ వీటిని ఆవిష్కరించారు. ఈ ఆభరణాలను విక్రయించకుండా దుబాయ్‌లో శాశ్వత ప్రదర్శన కోసం ఉంచారు.