సామాన్యుడిపై ధరల పెంపు భారం
NEWS Oct 26,2026 10:59 am
నిత్యావసర వస్తువుల ధరలు త్వరలో పెరిగే అవకాశాలున్నాయనే అంచనాలు సామాన్యులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. సబ్బులు, టూత్‌పేస్ట్‌లు, వంటనూనెలు, చాక్లెట్ల ధరలను పెంచేందుకు పలు FMCG కంపెనీలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అంతర్జాతీయ ముడిచమురు ధరలు, ముడిసరుకులు, ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరగడం దీనికి కారణాలుగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. మరోవైపు, డిసెంబర్ నాటికి టెలికాం సంస్థలు మొబైల్ రీఛార్జ్ ధరలను పెంచే అవకాశాలున్నాయని నివేదికలు సూచిస్తున్నాయి. నిత్యావసరాలు, కమ్యూనికేషన్ ఛార్జీలు పెరిగితే మధ్యతరగతి, పేద కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడనుంది.