ఎయిర్ షోలో పైలట్ కు తప్పిన ప్రమాదం
NEWS Apr 05,2025 09:08 am
ఆస్ట్రేలియాలోని విక్టోరియాలోని గీలాంగ్‌లో ఎయిర్ షో జరిగింది. వందలాది మంది గుమిగూడారు. విమానాలు సాహస ప్రదర్శనలో నిమగ్నమై ఉన్నాయి. ఇందులో ఒకటి అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి కూలి పోయింది. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయట పడ్డాడు పైలట్. తీవ్ర గాయాలైన తనను ఆస్పత్రిలో చేర్చారు. దీంతో ఎయిర్ షోను రద్దు చేశారు.