మాదకద్రవ్యాల నివారణపై రాష్ట్రస్థాయి శిక్షణ
NEWS Nov 18,2026 12:01 am
జగిత్యాల: హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మాదకద్రవ్యాల అవగాహన కార్యక్రమంలో జిల్లా నుంచి స్పెషల్ ఆఫీసర్ మహేష్, రాయికల్ జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాల ఉపాధ్యాయుడు, రిసోర్స్ పర్సన్ శ్రీకాంత్, 9వ తరగతి విద్యార్థి పస్తం విష్ణు పాల్గొన్నారు. డ్రగ్స్ దుష్ప్రభావాలు, నివారణ చర్యలపై అవగాహన కల్పించిన ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. జిల్లా స్థాయిలోనూ విద్యార్థులకు అవగాహన కల్పించనున్నట్లు వారు తెలిపారు.