అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో శుక్రవారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రమిదలతో ట్రంప్ ఆఫీసు దేదీప్యమానంగా వెలిగిపోయింది. NRI ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. ట్రంప్‌నకు భారతీయ టెక్ ప్రెన్యూర్, ప్రముఖ హెల్త్‌టెక్ సంస్థ జీవోక్యూఐఐ ఫౌండర్ విశాల్ గోండల్ ‘హనుమాన్ చాలీసా’ ప్రతిని బహూకరించారు. ధైర్యానికి, అచంచలమైన భక్తికి ప్రతీకగా కోట్లమంది భారతీయులు పఠించే హనుమాన్ చాలీసాను అధ్యక్షుడికి కానుకగా ఇవ్వడం తనకు మరిచిపోలేని ఘట్టంగా విశాల్ పేర్కొన్నారు.