నవంబర్ 9 నుంచి కోటి దీపోత్సవం!
NEWS Nov 07,2024 04:59 am
కార్తీక మాసాన్ని హిందువులందరూ అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. శివ కేశవులకు సైతం అత్యంత ప్రీతిపాత్రమైన మాసం కార్తీక మాసం అని భావిస్తారు. ఇక హైదరాబాదులో కార్తీకమాసం అనగానే హిందువులందరికీ భక్తి టీవీ-ఎన్టీవీ సంయుక్తంగా నిర్వహించే కోటి దీపోత్సవం కార్యక్రమం గుర్తుకు వస్తుంది. ఎన్టీవీ యాజమాన్యం ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అత్యంత భారీగా నిర్వహిస్తుంటుంది.