శ్రీవారి చిత్రకారుడు కన్నుమూత
NEWS Nov 15,2026 12:11 pm
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల పూజా గదులు, క్యాలెండర్లలో కనిపించే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ప్రసిద్ధ చిత్రాన్ని రూపొందించిన చిత్రకారుడు ఎస్.ఎం. శ్రీనివాసన్ (86) కన్నుమూశారు. వయోభారంతో తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కోవిల్పట్టిలో తుదిశ్వాస విడిచారు. ఆయన ప్రతిభను గుర్తించిన టీటీడీ 1970లో శ్రీవారి చిత్రాన్ని గీయడానికి ఆహ్వానించింది. ఆలయ గర్భగుడిలోని మూలవిరాట్టును ప్రత్యక్షంగా దర్శించుకుని స్వామివారి రూపాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. సర్వాభరణాలతో అలంకరించిన రూపంతో పాటు, ఆభరణాలు లేని నిజరూప దర్శన చిత్రాన్ని కూడా రూపొందించి భక్తుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించారు.