విజయదశమి రోజున రోజంతా శుభప్రదమైనదిగా భావించినప్పటికీ, విజయ ముహూర్తానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో అక్టోబర్ 20న మధ్యాహ్నం 1.57 నుంచి 2.44 గంటల వరకు విజయ ముహూర్తం ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించడం, పూజలు చేయడం శుభప్రదమనే విశ్వాసం ఉంది. ఈ సమయం కుదరకపోతే మధ్యాహ్నం 1.10 నుంచి 3.30 గంటల మధ్య అపరాహ్ణ కాలంలో పూజలు చేసుకోవచ్చని సూచిస్తున్నారు. ప్రాంతాలను బట్టి ముహూర్త సమయాల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చని చెబుతున్నారు.