హైదరాబాద్ (బ్రేకింగ్ నౌ): తెలంగాణలోని వరంగల్–ఖమ్మం సరిహద్దు గ్రామాల్లో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా రూపొందిన రాజు వెడ్స్ రాంబాయి చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే 2026 గద్దర్ అవార్డుల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, స్పెషల్ జ్యూరీ, బెస్ట్ సింగర్ విభాగాల్లో నాలుగు అవార్డులు సాధించడం విశేషం. ఈ సందర్భంగా ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో చిత్రబృందానికి అభినందన సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో దర్శకుడు, నిర్మాత వేణు ఊడుగుల మాట్లాడుతూ ఇప్పటి వరకు తమకు వచ్చిన అవార్డుల కంటే విమర్శకుల అభినందనలే పెద్ద గుర్తింపుగా భావిస్తున్నామని తెలిపారు. తాను దర్శకుడు కాకపోయి ఉంటే జర్నలిస్టుగా ఉండేవాడినని, చిన్న వయస్సులోనే కాలమిస్టుగా పుస్తకాలపై సమీక్షలు రాసిన అనుభవం ఉందని గుర్తుచేశారు. విమర్శకులు దర్శకుడి దృక్కోణాన్ని అర్థం చేసుకుని స్పందించడం ప్రత్యేకమని, అలాంటి వారి అభినందనలు తమకు మరింత బాధ్యతను పెంచాయని చెప్పారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కంటెంట్ ఆధారిత సినిమాలు నిర్మిస్తామని తెలిపారు.

సీనియర్ జర్నలిస్ట్ ప్రాభు మాట్లాడుతూ ప్రస్తుతం చిన్న సినిమాలకు థియేటర్లలో అవకాశాలు పొందడం చాలా కష్టమైపోయిన పరిస్థితుల్లో రాజు వెడ్స్ రాంబాయి చిత్రం అనూహ్య విజయాన్ని సాధించడం అభినందనీయమన్నారు. కథా నిర్మాణం, నటీనటుల సహజ నటన, భావోద్వేగాల ఆవిష్కరణ ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా నిలబెట్టాయని చెప్పారు.
దర్శకుడు సాయిలు కంపాటి మాట్లాడుతూ తాను చూసిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రూపొందించానని తెలిపారు. సినిమా విజయవంతమైతే నిర్మాతకు డబ్బులు వస్తే చాలని భావించానని, అవార్డులు బోనస్‌లా అనిపిస్తున్నాయని చెప్పారు. ఈ విజయానికి మీడియా ప్రోత్సాహం ఎంతో కీలకమని అన్నారు.

నటుడు శివాజీ రాజా మాట్లాడుతూ ఈ సినిమా తనకు మరపురాని అనుభవమని, దర్శకుడు సాయిలు కంపాటి భవిష్యత్తులో పెద్ద దర్శకుడిగా ఎదుగుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. చైతన్య జొన్నలగడ్డ మాట్లాడుతూ ఈ సినిమా విజయానికి 70 శాతం మీడియా మద్దతే కారణమని తెలిపారు.
ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బత్తుల జేవీ ప్రసాద్ మాట్లాడుతూ ఈ చిత్రం తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యే కథ కాదు, దేశంలోని ప్రతి మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి కుటుంబాల జీవన వాస్తవాలను ప్రతిబింబించే కథ అని పేర్కొన్నారు. జనరల్ సెక్రటరీ సురేష్ కొండేటి మాట్లాడుతూ మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎప్పటికీ ప్రోత్సహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో నిర్మాతలు రాహుల్ మోపిదేవి, నాగేశ్వరరావు పూజారి, సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫర్ వాజిద్ బేగ్, ఎడిటర్ నరేష్ అడుప, అనితా చౌదరి తదితరులు పాల్గొన్నారు.

మీట్ ది ప్రెస్ వివరాలు:
ప్రశ్న – జవాబు
ఈ కథ దర్శకుడు చెప్పినప్పుడు మీకు నమ్మకం కలగటానికి అందులో దోహదం చేసిన అంశాలు ఏమిటీ?
వేణు ఊడుగుల– మొదట నేను ప్రొడక్షన్ చేయాలని అనుకోలేదు. భవిష్యత్తులో ప్రొడ్యూస్ చేయాలనే ఆలోచన ఉండే కానీ ఇప్పుడే ప్రొడ్యూసర్ కావాలనే ఆలోచన నాకు లేదు. అదే టైమ్‌లో సాయిలు కంపాటి నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేయడం కోసం వస్తుండే వాడు. సురేష్ బొబ్బిలి అతన్ని నా దగ్గరికి తీసుకొచ్చాడు. అతను మాట్లాడుతుంటే, అతను మాట్లాడే విధానంలో నాకు నిజాయితీ కనిపించింది. అతను మాట్లాడటమే హృదయంతో మాట్లాడుతున్నట్టుగా అనిపించింది. వీడెవడో మనలాడే ఉన్నాడే అనిపించింది. అప్పుడు అతన్ని రమ్మని చెప్పాను. అప్పుడు తను ఒక సంఘటన జరిగింది అని చెప్పాడు. బాగుందే రానీ ఫస్ట్ సినిమా రిస్క్ ఏమో ఒకసారి ఆలోచించు. నేనైతే నీకు కచ్చితంగా సహయం చేస్తా. సినిమా మెటీరియలైజ్ కావడానికి నేను సహయం చేస్తా. అయితే ఫస్ట్ సినిమా రిస్క్ అవుతదేమో ఆలోచించు అన్నాను. తేదన్నా మీరు కథ విన్నండి.విన్న తరువాత చెప్పండి అన్నాడు. నెక్స్ట్ డే కథ చెప్పినప్పుడు జరిగిన సంఘటనని కథగా విన్నప్పుడు నాకు బాగా నచ్చింది. బాగా ఎట్రాక్ట్ అయిన. దీన్ని ప్రొడ్యూస్ చేస్తా అని మాటిచ్చిన. ఎందుకంటే డైరెక్టర్స్ రెండు రకాలు. ఒకరు మైండ్‌తో చేస్తే మరొకరు హార్ట్‌తో చేస్తారు. హార్ట్ ఇంటలిజెంట్స్ ఉంటారు. హార్ట్ ఇంటలిజెన్స్‌తో జనాల్ని ఆకట్టుకోగలుగుతారు. హృదయాన్ని టచ్ చేయగలరు. రాము కథని రాసిన విధానంలో హార్ట్ ఇంటలిజెన్స్ నన్ను ఎట్రాక్ట్ చేసింది. వెంటనే నేను అప్పుడు ఈటీవీ విన్ వారికి నేను ఈ కథని పిక్ చేశాను. చెప్పగానే వాళ్లు ఒప్పుకోవడం కూడా అదృష్టం. వారు అంగీకరించకపోతే నేను ఇంత త్వరగా ప్రొడ్యూసర్‌ని అయ్యేవాడిని కాదు.వాళ్లకు ఈ సందర్భంగా థ్యాంక్స్ చెబుతున్నాను.Movies
చైతన్య గారు మిమ్మల్ని బయట చూసి స్క్రీన్‌పై చూస్తే షాకింగ్‌గా ఉంది. యాక్టింగ్‌లో ఏమైన ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారా?
చైతన్య జొన్నలగడ్డ– అలాంటిది ఏమీ లేదు. నాకు యాక్టింగ్ రాదు కాబట్టే నేచురల్‌గా నటించగలిగానేమో.
వేణు ఊడుగుల గారు నిర్మాతగా ఇలాగే కొనసాగుతారా? దర్శకుడిగా కొనసాగుతూనే నిర్మాణం కూడా కంటిన్యూ చేస్తారా?
ఇంతకు ముందు పెట్టుబడి కథలని నిర్ణయించేది. కానీ ఇప్పుడు కథలే పెట్టుబడిని నిర్ణయించే సానుకూలమైనటువంటి వాతావరణంలో ఇండస్ట్రీ వుంది కాబట్టి ప్రొడక్షన్‌ని కొనసాగిస్తాను. ప్రస్తుతం ఒకటి రెండు ప్రాజెక్ట్‌లు లైన్‌లో ఉన్నాయి. అయితే డైరెక్షన్ కే నా తొలి ప్రాధాన్యత.
చాలా మంది దర్శకులు నిర్మాతలుగా బాధ్యతలు చేపట్టాలంటే చాలా రిస్క్‌గా భావిస్తున్నారు. అనిల్ రావిపూడి కూడా ఆ ఒక్కటి తప్ప ఏదైనా చేస్తాను అంటున్నారు. ఆయన ప్రొడక్షన్‌లోకి రావడానికి ఆసక్తిని చూపించడం లేదు. అలాగే చాలా మంది ప్రొడ్యూసర్లు డైరెక్షన్ నా వల్ల కాదు అంటూ దూరంగా ఉంటున్నారు. మీ రెండు పడవల ప్రయాణంలో మిమ్మల్ని ఏది డామినేట్ చేసింది? ఏది ఇష్టంగా అనిపించింది?
వేణు ఊడుగుల- డైరెక్షన్ అనేది నా మెయిన్ ఎక్స్‌ప్రెషన్. నేను చెప్పాలనుకున్న కథల్ని నా డైరెక్షన్‌లో చెప్పాలనుకుంటాను. నిర్మాణం అనేది డైరెక్షన్ నుంచి నిర్మాణం వైపు షిఫ్ట్ అవ్వడం కాదు. అదొక నా కెరీర్ ఎక్స్‌టెన్షన్. ఇప్పుడున్న పరిస్థితులల్లో రాహుల్ మోపిదేవి, నాగేశ్వరరావు పూజారి లాంటి వ్యక్తుల సపోర్ట్ నాకు ఉంది కాబట్టి కంటెంట్ బేస్డ్ చిన్న సినిమాలు చేయాలనుకుంటున్నాను.
పూజారి నాగేశ్వరరావు గారు మీ ప్రొఫెషన్‌లో ఎంతో బిజీగా ఉన్న మీరు నిర్మాణ రంగం వైపు రావడానికి ప్రధాన కారణం ఏమిటీ?
నాగేశ్వరరావు పూజారి – మంచి కథ. దీన్ని జనాలకు చెప్పాలని నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను. ఎందుకంటే సినిమాలతో సమాజంతో మార్పు తీసుకురావాలన్నదే నా ఉద్దేశ్యం. నేను నాలుగు గోడల మధ్య మాట్లాడితే ఎవరికీ అర్థం కాదు. నేను చెప్పే సందేశం చాలా మందికి రీచ్ కాదు. సమాజంలో మార్పు తేవడానికి కల అన్నది ప్రధాన కారణం కాబట్టి మంచి కథలని జనాలకు అందించాలనే ఉద్దేశ్యంతోనే నిర్మాణ రంగంలోకి ప్రవేశించడం జరిగింది.
శివాజీరాజాగారూ ఎన్నో పాత్రలు ఆల్ రెడీ మీరు చేసి ఉన్నారు. ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్లు చేశారు. ఈ సినిమా ఆఫర్ వచ్చినప్పుడు ఈ మూవీ గెటప్ చూపించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. ఈ క్యారెక్టర్ చేసినప్పుడు మిమ్మల్ని మరో మెట్టు ఎక్కిస్తుందనే భావన మీకు కలిగే ఉంటుంది.
ఈ సినిమా విషయంలో మీకు లభించిన మర్చిపోలేని మెమొరబుల్ ఇన్సిడెంట్స్ గురించి ఏమైనా చెబుతారా?
శివాజీ రాజా – ఈ సినిమానే ఓ మెమొరబుల్ ఇన్సిడెంట్. ఇన్ని సినిమాలు చేసినా కూడా తెలంగాణలో మారుమూల గ్రామాలకు వెళ్లి చేయడం అనేది చాలా తక్కువ. నాకు కష్టం అనిపించింది. డైరెక్టర్ రాము చిన్న చిన్న వాటిని కూడా పట్టుకోవడం కష్టం అనిపించింది. పైకి అలా ఉంటాడు కానీ ఒక్క సారి షాట్ రెడీ అనగానే ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తాడు. అతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సీన్‌లలో డబ్బింగ్‌లో సరి చేసుకున్నాను.
చైతన్య జొన్నలగడ్డ.. హీరోగా మీ సోదరుడు సిద్దూ జొన్నలగడ్డ ఎంత పేరు తెచ్చుకున్నారో ఈ ఒక్క క్యారెక్టర్‌తో మీరు అంత పేరు తెచ్చుకున్నారు. నన్ను ఈ ఒక్క క్యారెక్టర్‌తో మింగేశావని అన్నారా?
చైతన్య జొన్నలగడ్డ– ఈ స్థాయికి రావడానికి నేను ఎనిమిదేళ్లు కష్టపడ్డాను. నువ్వు వచ్చిన మూడేళ్లకే ఇంత పేరొచ్చింది. అవార్డు కూడా ఇచ్చారు.
అవార్డులు వస్తాయని ఊహించారా?
చైతన్య జొన్నలగడ్డ– లేదండీ అస్సలు ఊహించలేదు. అవార్డులు ప్రకటించిన రోజు వరుసగా ఫోన్‌లు వస్తున్నాయి. వేణు ఊడుగుల అన్న ఏమో ఫోన్ చేసి ఏం చేస్తున్నావ్ అని అడిగాడు. ఏమైంది అంటే ఒకసారి న్యూస్‌లో ఏమొస్తుందో చూసుకో అన్నాడు. న్యూస్ చూసి షాక్ అయ్యాను.
నాగేశ్వరరావు పూజారి గారు మీరు బిజీయెస్ట్ లాయర్. అలాంటి మీరు ఈ సినిమా ప్రొడక్షన్‌లోకి రావాలనే మీ ఆలోచనకు స్ఫూర్తి ఏమీటి?
మనిషికీ సినిమాకు అవినాభావ సంబంధం ఏందంటే ఊపిరి. సినిమా అనేది ఊపిరి. ప్రపంచంలో ఎక్కడున్నా కూడా జసినిమా అనేది జనాలని ప్రభావితం చేస్తుంది కాబట్టి ఆ జనాలలో మార్పుని చూడటానికి సినిమా ద్వారా ఆ మార్పుని తీసుకురావాలనే ఉద్దేశ్యంతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాను.
తొలి సినిమాతో అద్భుతమైన విజయాన్ని సాధించారు కాదా.. మీ ప్రయాణం ఎలా ఉండబోతోంది? ప‌్రొడ్యూసర్‌గా కొనసాగుతారా?
నాగేశ్వరరావు పూజారి– ఖచ్చితంగా. ఫస్ట్ నేను మా వేణు ఊడుగుల అన్నకు అభినందనలు చెప్పాలి. ఎందుకంటే తొలి సినిమాతోనే థియేటర్లో పేరు పడిబ్లాక్ బస్టర్ అయి గద్దర్ అవార్డ్స్ వచ్చాయి కాబట్టి చాలా సంతోషంగా ఉన్నాను. దీని తరువాత మా ప్రొడక్షన్‌లో కంటిన్యూగా మా వేణు అన్న సహకారంతో సినిమాలు చేస్తాం. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
రాహుల్ మోపిదేవి… మీరు యంగ్ ప్రొడ్యూసర్. మీ పేరు చెప్పగానే పెద్దాయన అనుకున్నాం. మీరు చూస్తే చాలా యంగ్ గా ఉన్నారు. మీ మొదటి సినిమాకే ఇలాంటి అప్లాజ్ రావడంఎలా అనిపించింది? గతంలో ఏదైనా అనుభవం ఉందా?
గతంలో ఒకటి రెండు సినిమాలు చేసిన అనుభవం ఉంది. అయితే ప్రొడక్షన్ పరంగా మాత్రం ఇదే ఫస్ట్ మూవీ. చాలా నేర్చుకున్నాను.
