www.breakingnow.app | Fri, 20 Nov 2026
SPIRITUAL Delhi, New Delhi

బాలీలో భారీ వినాయక విగ్రహం!

Share:
128 Views
బాలీలో భారీ వినాయక విగ్రహం!

ఇండోనేషియాలోని బాలీలో ఏర్పాటు చేసిన 50 అడుగుల వినాయక విగ్రహం గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది. సింథటిక్‌ రట్టన్‌ (పాలిథిలిన్‌ ప్లాస్టిక్‌)తో రూపొందించిన అతిపెద్ద కళాఖండంగా ఈ విగ్రహం గుర్తింపు పొందింది. అలాస్‌ హరూమ్‌ బాలీ అనే కళాకారుడు దీనిని రూపొందించారు. బాలీలోని గియాన్యార్‌ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహానికి గిన్నిస్‌ సంస్థ అధికారిక గుర్తింపు ఇచ్చినట్లు ఇండోనేషియాలోని భారత రాయబార కార్యాలయం వెల్లడించింది. హిందూ సంప్రదాయాలకు ప్రసిద్ధి చెందిన బాలీలో ఈ భారీ వినాయక విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. అక్కడి ఆలయాలు, శిల్పాలు, కళారూపాల్లో భారతీయ సంస్కృతి ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.