www.breakingnow.app | Thu, 19 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ఉపాధ్యాయ సమస్యలపై డీఈఓతో టీజీయూఎస్ నేతల భేటీ

Share:
128 Views
ఉపాధ్యాయ సమస్యలపై డీఈఓతో టీజీయూఎస్ నేతల భేటీ

జగిత్యాల: జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలు, విద్యారంగానికి సంబంధించిన పలు అంశాలపై టీజీయూఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు నునావత్ రాజు జిల్లా విద్యాశాఖాధికారి కె. రాముతో భేటీ అయ్యారు. ఉపాధ్యాయుల సమస్యలను డీఈఓ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యారంగ అభివృద్ధితో పాటు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలని విజ్ఞప్తి చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు నకుమల్ల నర్సయ్య, బీటీఏపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ బాబు పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.