www.breakingnow.app | Fri, 20 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన

Share:
128 Views

రాయికల్: మండల కేంద్రంలోని బాలికల ఉన్నత పాఠశాలలో మాదకద్రవ్యాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఎస్‌సీఈఆర్‌టీ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణపై శిక్షణ పొందిన ఉపాధ్యాయుడు శ్రీకాంత్, శిక్షణ పొందిన విద్యార్థి కలిసి పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలు, ఆరోగ్యంపై వాటి దుష్ప్రభావాలు, వాటికి దూరంగా ఉండాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎంఈఓ శ్రీపతి రాఘవులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.