‘హనుమాన్ అంశ్’ తెలుగు ట్రైలర్ విడుదలైంది. ప్రముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ కరోలీ బాబా జీవిత కథ ఆధారంగా ₹2 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీ ₹423 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు చిత్రబృందం తెలిపింది. బ్రిటిష్ కాలం నాటి నేపథ్యం, బాబా ఆధ్యాత్మిక ప్రయాణం, హనుమాన్ భక్తికి సంబంధించిన అంశాలను ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. KGF, సలార్ చిత్రాల నిర్మాణ సంస్థ హోంబలే ఫిలింస్ తెలుగు హక్కులను సొంతం చేసుకుంది. ఈ చిత్రం అక్టోబర్ 9న తెలుగులో విడుదల కానుంది.