www.breakingnow.app | Thu, 19 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

పరఖ్ కరదీపికలు ఆవిష్కరించిన డీఈఓ

Share:
128 Views
పరఖ్ కరదీపికలు ఆవిష్కరించిన డీఈఓ

జగిత్యాల: కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్‌ను డీఈఓ కే. రాము ప్రారంభించారు. అనంతరం ఎఫ్‌ఎల్‌ఎన్ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించి, మూడో తరగతి పరఖ్ ఆంగ్లం, పరిసరాల విజ్ఞానం ప్రశ్నల నిధి, గణిత సమస్యల పరిష్కార పద్ధతులతో రూపొందించిన కరదీపికలను ఆవిష్కరించారు. విద్యార్థులను పరఖ్ రాష్ట్రీయ సర్వేక్షణ్ పరీక్షకు సన్నద్ధం చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఏఎంఓ మంద చంద్రశేఖర్ రెడ్డి, ఎఫ్‌ఎల్‌ఎన్ సెల్ సభ్యులు సంధి శ్రీనివాస్ రెడ్డి, కడకుంట్ల అభయ్ రాజ్, గుండు విజయ్, దాసరి జయంత్ పాల్గొన్నారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.