2027 వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ విడుదల
NEWS Oct 02,2026 10:33 am
క్రికెట్ వన్డే ప్రపంచకప్ 2027 షెడ్యూల్‌ను ICC విడుదల చేసింది. దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న ఈ టోర్నమెంట్ సరికొత్త ఫార్మాట్‌తో అభిమానులను అలరించనుంది. అక్టోబర్ 7న కేప్‌టౌన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తన తొలి మ్యాచ్ ఆడనుంది. మొత్తం 14 జట్లు. గ్రూప్ స్టేజ్‌కు 12 జట్లే అర్హత సాధిస్తాయి. ఆతిథ్య దేశాలుగా దక్షిణాఫ్రికా, జింబాబ్వే నేరుగా అర్హత పొందాయి. వీటితో పాటు, 2026 సెప్టెంబర్ 30 నాటికి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్-8లో నిలిచిన జట్లు కూడా నేరుగా క్వాలిఫై అవుతాయి. దీంతో మొత్తం 10 జట్లు ఖరారవుతాయి.