ప్యారడైజ్ సినిమాకు కేటీఆర్ రివ్యూ
NEWS Sep 27,2026 10:44 am
కేటీఆర్ సుదర్శన్ థియేటర్‌లో ది ప్యారడైజ్ సినిమా చూశారు. సమాజంలో అణచివేత ఎదురైనప్పుడు ఆ సమాజం తన అస్తిత్వం కోసం చేసే పోరాటం, న్యాయం కోసం గళమెత్తే తీరును అద్భుతంగా చూపించారన్నారు. అణచివేతకు గురైన ప్రజల పక్షాన ఒక నాయకుడు నిలబడి, ఆ సమాజాన్ని ఎలా ముందుండి నడిపించాడో చక్కటి కథాంశంతో ఆవిష్కరించారని చెప్పారు. ఈ అస్తిత్వ పోరాటానికి అద్భుతమైన దృశ్యరూపం ఇచ్చిన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నానికి, ప్రియదర్శికి, బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.