నాని నటించిన ‘ది ప్యారడైజ్’ మూవీ విడుదలైంది. ఈ సినిమాలో ప్రియదర్శి పాత్ర హాట్ టాపిక్ అవుతోంది. ఎమ్మెల్యే శంకర్ పాత్రలో ఆయన కేసీఆర్‌ను పోలిన పాత్రతో ఆకట్టుకుంటున్నాడు. కేసీఆర్ ప్రసంగాలను పోలిన సంభాషణలు, ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించేలా హావభావాలతో ప్రియదర్శి పాత్ర ఉంది. ప్రస్తుతం ఈ ఫొటోలను అభిమానులు షేర్ చేస్తున్నారు. తెలంగాణ యాసలో ఇరగదీశారని కామెంట్స్ చేస్తున్నారు.