హైదరాబాద్: ట్యాంక్‌బండ్ పరిసరాల్లో వినాయక నిమజ్జనాల సందడి నెలకొంది. ‘గణపతి బప్పా మోరియా.. జై బోలో గణేష్ మహారాజ్ కీ జై’ నినాదాలతో ట్యాంక్‌బండ్ పరిసరాలు మారుమోగుతున్నాయి. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలు నిమజ్జనం కోసం భారీగా తరలివస్తుండటంతో ప్రధాన మార్గాల్లో భక్తుల రద్దీ పెరిగింది. గణనాథుల ఊరేగింపులతో ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు.