‘ఇండియా పోస్ట్’ గిఫ్ట్‌ల ప్రచారం ఫేక్
NEWS Sep 19,2026 04:45 pm
‘డాక్ సేవా గిఫ్ట్స్’ పేరుతో ఇండియా పోస్ట్ గిఫ్ట్‌లు, రివార్డులు, లక్కీడ్రాలు అందిస్తోందంటూ సోషల్ మీడియాలోని ప్రచారాన్ని ఫేక్‌గా తేల్చింది PBI ఫ్యాక్ట్‌చెక్. ఈ పథకంతో ఇండియా పోస్టుకు సంబంధం లేదని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయవద్దని, వ్యక్తిగత వివరాలు, బ్యాంకు ఖాతా, ఓటీపీ, ఆధార్ వివరాలను ఎవరితోనూ పంచుకోవ ద్దని సూచించింది. అనుమానాస్పద సమాచారాన్ని PBI ఫ్యాక్ట్‌చెక్ వాట్సప్ 8799711259 లేదా factcheck@pib.gov.inకు తెలపాలని కోరింది.