కడపలో కూటమి ప్రభంజనం!
NEWS Nov 07,2026 11:42 pm
కడప: వైసీపీకి కంచుకోటగా భావించే ఉమ్మడి కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి సత్తా చాటింది. మొత్తం 39 జడ్పీటీసీ స్థానాలకు గానూ 23 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 16 స్థానాలకు జరిగిన పోటీలో 13 చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. మొత్తం మీద టీడీపీ 30, బీజేపీ 3, జనసేన 3 స్థానాలను కైవసం చేసుకున్నాయి. వైసీపీకి కేవలం రెండు స్థానాలే దక్కాయి. పులివెందులలో టీడీపీ అభ్యర్థి భారతి 1,463 ఓట్ల మెజార్టీతో గెలవగా, రాజంపేటలో పోలి సుబ్బారెడ్డి 17,440 ఓట్ల భారీ ఆధిక్యాన్ని సాధించారు.