బస్తర్: ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ భద్రతా దళాల సిబ్బందితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్ క్యాంపులో జవాన్లను ఉద్దేశించి మాట్లాడుతూ నక్సలిజంపై దశాబ్దాల పోరాటంలో దేశం సాధించిన విజయాన్ని ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు, భద్రతా సిబ్బంది చేసిన త్యాగాలు, అంకితభావం వల్లే ఇది సాధ్యమైందన్నారు. సాయుధ నక్సలిజం అంతమైనప్పటికీ, భావజాల రూపంలో ఉన్న ముప్పు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతర్గత భద్రతకు ముప్పు కలిగించే శక్తులను దృఢ సంకల్పంతో ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.