విఘ్నేశ్వరుడికి విశ్వవ్యాప్త కీర్తి
NEWS Sep 14,2026 10:09 am
గణపతిని భారత్‌తో పాటు అనేక ఆసియా దేశాల్లో భిన్న రూపాలు, పేర్లతో ఆరాధిస్తున్నారు. నేపాల్‌లో శుభకార్యాల ముందు పూజిస్తారు. థాయ్‌లాండ్‌లో ‘ఫ్రా ఫికానెట్’ పేరుతో అదృష్టం, విజయానికి ప్రతీక. కంబోడియాలో ప్రాచీన ఆలయాల్లో గణేశుడి శిల్పాలు కనిపిస్తాయి. ఇండోనేషియాలో జ్ఞానానికి చిహ్నంగా భావిస్తారు. జపాన్‌లో ‘కంగితేన్’ పేరుతో బౌద్ధ ఆలయాల్లో పూజలు జరుగుతాయి. మయన్మార్‌లో అడ్డంకులను తొలగించే దేవుడిగా, చైనా, టిబెట్, మంగోలియాల్లో సంపద, అదృష్టం, రక్షణకు ప్రతీకగా గణపతిని కొలుస్తారు. ఇలా దేశాలు, సంప్రదాయాలు మారినా గణపతిపై విశ్వాసం విశ్వవ్యాప్తంగా విస్తరించింది.