నితీశ్ కుమార్ రెడ్డి బౌలింగ్ చూసి ఆశ్చర్యపోయాను: అనిల్ కుంబ్లే
NEWS Jul 11,2025 02:13 pm
తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి లార్డ్స్ టెస్టు తొలిరోజున ప్రభావంతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన ఆతిథ్య ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకోగా... నితీశ్ కుమార్ రెడ్డి ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీసి ఇంగ్లండ్ ను దెబ్బకొట్టాడు. దీనిపై టీమిండియా బౌలింగ్ దిగ్గజం అనిల్ కుంబ్లే స్పందించాడు.