5G స్మార్ట్‌ఫోన్ తీసుకొస్తున్న BSNL
NEWS Oct 29,2024 07:48 am
అతి తక్కువ ధరలో, అందరికీ అందుబాటులో ఉండేలా 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. సెమీ అర్బన్ ఏరియాల్లో బలంగా ఉన్న BSNL వారిని లక్ష్యంగా చేసుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొస్తోంది. ధర రూ. 10 వేల నుంచి 15 వేల మధ్య ఉండొచ్చని టాక్. 5G రేస్‌లో వెనక బడిపోయిన BSNL ఇప్పుడు ప్రైవేటు కంపెనీలకు గట్టి పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. త్వరలోనే 4జీ నెట్‌వర్క్‌ను అందరికీ అందుబాటులోకి తీసుకొస్తున్న సంస్థ.. ఇప్పుడు 5G ఫోన్‌ను అందరికీ దగ్గర చేసే ప్రయత్నాలు ప్రారంభించింది.