రోబోలకు శిక్షణ.. గంటకు ₹ 250
NEWS Oct 23,2026 10:00 pm
AI కొత్త ఉద్యోగ అవకాశాలు అందిస్తున్నాయి. తలకు కెమెరా లేదా స్మార్ట్ఫోన్ కట్టుకుని రోజువారీ పనులను వీడియోలుగా రికార్డ్ చేస్తే గంటకు ₹150 నుంచి ₹250 వరకు చెల్లిస్తున్నారు. పలు ప్రాంతాల్లో మహిళలు, కార్మికులు ఈ పనిలో పాల్గొంటున్నారు. వంట చేయడం, బట్టలు ఉతకడం, శుభ్రం చేయడం, హెయిర్ కటింగ్ వంటి పనుల వీడియోలను సేకరించి, రోబోలకు శిక్షణ ఇచ్చేందుకు కంపెనీలు ఉపయోగిస్తున్నాయి. అయితే, భవిష్యత్తులో తమ ఉద్యోగాలను భర్తీ చేసే రోబోలకు తామే శిక్షణ ఇస్తున్నామనే ఆందోళన కూడా వ్యక్తమవుతోంది.