ఇంజినీరింగ్ డిగ్రీ లేకుండానే ఉత్తరాఖండ్‌కు చెందిన రవి తమ్తా ఎగిరే కారు నమూనాను రూపొందించాడు. 2015 నుంచి ఇంటర్నెట్ ద్వారా సాంకేతిక అంశాలను నేర్చుకుంటూ 13 ఏళ్లుగా ప్రయోగాలు చేశాడు. ‘హపిడా స్కైనెక్స్’ పేరుతో సింగిల్ సీటర్ ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ కారును అభివృద్ధి చేశాడు. డ్రోన్ సాంకేతికత ఆధారంగా రూపొందించిన ఈ వాహనం నిలువుగా టేకాఫ్, ల్యాండింగ్ చేయగలదని సమాచారం. ఈ ఏడాది ఆగస్టులో ప్రయోగాత్మక పరీక్ష నిర్వహించాడు. కొండ ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలకు ఉపయోగపడేలా దీన్ని అభివృద్ధి చేయాలన్నది ఆయన లక్ష్యం. పూర్తిస్థాయి వినియోగానికి డీజీసీఏ అనుమతులు, మరిన్ని టెస్టులు అవసరం.