www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Telangana, Jagtial

ప్రయోగాత్మక విద్యకు సైన్స్ ల్యాబ్ ఎంతో దోహదం: ఆది శ్రీనివాస్

Share:
128 Views
ప్రయోగాత్మక విద్యకు సైన్స్ ల్యాబ్ ఎంతో దోహదం: ఆది శ్రీనివాస్

భీమారం: మన్నెగూడెం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన సైన్స్ ల్యాబ్‌ను ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి కె. రాము ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పుస్తకాల్లో చదివిన విజ్ఞానాన్ని ప్రయోగాల ద్వారా ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు సైన్స్ ల్యాబ్ ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, పరిశోధనా ఆసక్తిని పెంపొందించేందుకు ఇటువంటి సదుపాయాలు దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రయోగాలపై ఆసక్తి పెంచుకుని నూతన ఆవిష్కరణల దిశగా సాగాలని సూచించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.