www.breakingnow.app | Sat, 28 Nov 2026
LATEST NEWS Telangana, Hyderabad

నిరుపేద కుటుంబానికి దాతల అండ

Share:
128 Views
నిరుపేద కుటుంబానికి దాతల అండ

ఆర్థిక ఇబ్బందులతో ఉన్న నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి పలువురు దాతలు మానవత్వాన్ని చాటుకున్నారు. పీర్జాదిగూడలోని శ్రీసాయి శ్రీరామ ఆర్‌టీసీ కాలనీలో నవంబర్ 28న జరిగిన సాయి సుప్రియ పెళ్ళికి తెలంగాణ మ్యారేజ్ బ్యూరో, జీబీఎన్ ఎలైట్, ఎంఎస్ బ్రదర్స్ బృందం సభ్యులు ఆర్థిక, వస్తురూప సాయం అందించారు. సందగల మధుసూదన్ గౌడ్, మలుగారి శేఖర్ గౌడ్‌లు పుస్తెమెట్టెలు, ఇంటి ఫర్నిచర్, ఇతర పెళ్లి సామగ్రిని సమకూర్చారు. కష్టకాలంలో అండగా నిలిచిన దాతలకు వధువు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు వారి సేవలను అభినందించారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.