www.breakingnow.app | Sat, 28 Nov 2026
EDUCATION Telangana, Nizamabad

నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

Share:
128 Views
నవోదయ ప్రవేశ పరీక్ష ప్రశాంతం

కమ్మర్ పల్లి: మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్ష కొనసాగింది. ఈ పరీక్షకు మొత్తం 132 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 117 మంది విద్యార్థులు హాజరయ్యారు. మరో 15 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాధికారి (ఎంఈవో) ఆంధ్రయ్య వెల్లడించారు. పరీక్షా కేంద్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయని తెలిపారు.

B.
Get instant news alerts in 60 words!

Download Breaking Now App on your smartphone.