జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ
NEWS Oct 15,2026 12:09 am
మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేన పార్టీలో చేరారు. పవన్ కల్యాణ్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాధాకృష్ణ చేరికతో విజయవాడ మేయర్ అభ్యర్థిగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. అయితే, మేయర్ పదవిని కూటమిలో జనసేనకు కేటాయిస్తారా? రాధాకృష్ణ పోటీ చేస్తారా? అన్నది ఇంకా స్పష్టత రాలేదు. విజయవాడలో 35 డివిజన్లు జనసేన కోరుతున్నట్లు సమాచారం. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు కొనసాగుతున్న నేపథ్యంలో రాధాకృష్ణ రాజకీయ భవిష్యత్తుపై ఆసక్తి నెలకొంది.