అదనపు కలెక్టర్కు ఆత్మీయ వీడ్కోలు
NEWS Oct 15,2026 12:06 am
జగిత్యాల: బదిలీపై నిజామాబాద్కు వెళ్తున్న జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. రాజగౌడ్కు పీఆర్టీయూ టీఎస్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బోయినపల్లి ఆనందరావు మాట్లాడుతూ, అదనపు కలెక్టర్ అందించిన సేవలను కొనియాడారు. సంఘం నాయకులు, ఉపాధ్యాయులు, పలువురు అధికారులు పాల్గొని రాజగౌడ్కు శుభాకాంక్షలు తెలిపారు.