అక్టోబర్ 16న ‘లెహ్రావో దో తిరంగా’ నిరసన
NEWS Oct 14,2026 09:40 pm
ఢిల్లీ: తమ పార్టీ సహ కన్వీనర్లు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాల అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్ సెంట్రల్ పార్క్లో త్రివర్ణ పతాక ప్రదర్శన నిర్వహించనున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ప్రకటించారు. సాయంత్రం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి ‘లెహ్రావో దో తిరంగా’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. జాతీయ జెండాలతో నిరసనలో పాల్గొనాలని దేశభక్తులకు ఆయన పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించడం నేరం కాదనే సందేశాన్ని ఈ కార్యక్రమం ద్వారా చాటుతామని పేర్కొన్నారు. ఢిల్లీకి రాలేని వారు తమ ప్రాంతాల్లోనూ తిరంగా మార్చ్లు నిర్వహించాలని కోరారు. ఇదిలా ఉండగా, అజింక్య షిండే వ్యక్తిగత పూచీకత్తుపై విడుదలైనట్లు కథనంలో పేర్కొన్నారు.