మున్సిపల్ చైర్మన్ రేసులో కృష్ణకిషోర్ రెడ్డి
NEWS Oct 14,2026 02:38 pm
గిద్దలూరు: మున్సిపల్ చైర్మన్ పీఠం ఓసీ జనరల్కు కేటాయించడంతో రాజకీయ పార్టీల్లో ఆశావహుల సందడి పెరిగింది. టీడీపీ తరఫున ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి సోదరుడు కృష్ణ కిషోర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. సర్వేలు, పార్టీ వర్గాల మద్దతు ఆయనకు అనుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు వైసీపీ నుంచి డాక్టర్ భూమా బాల నరసింహారెడ్డి, రామచంద్ర రెడ్డి పేర్లు చర్చలో ఉన్నాయి. అయితే, చైర్మన్ అభ్యర్థుల ఎంపికపై ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. దీంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.