చైర్మన్ రేసులో ఐవీఆర్ఎస్ కలకలం!
NEWS Oct 14,2026 02:37 pm
గిద్దలూరు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో టీడీపీ కూటమిలో చైర్మన్ పదవి కోసం ఆశావహులు పోటాపోటీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ కాల్స్లో తమ పేర్లకు మద్దతు ఇవ్వాలంటూ అనుచరులు, పార్టీ శ్రేణుల ద్వారా ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. చైర్మన్ అభ్యర్థి ఎంపికలో పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఎవరి ప్రయత్నాలు ఫలిస్తాయి? ఎవరికి అధిష్ఠానం అవకాశం కల్పిస్తుంది? అన్నది ప్రస్తుతం గిద్దలూరు రాజకీయాల్లో ఆసక్తికర చర్చగా మారింది.