బూతుపాట పాడిన హీరోపై కేసు నమోదు
NEWS Feb 05,2026 11:10 am
హైదరాబాద్: బుల్లితెర నటుడు ప్రభాకర్ తనయుడు, హీరో చంద్రహాస్‌పై మాదాపూర్ పీఎస్‌లో కేసు నమోదైంది. ‘బరాబర్ ప్రేమిస్తా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్ బూతు పదాలతో రాసిన పాట పాడారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేయగా, చంద్రహాస్ ఆయన్ను బెదిరిస్తూ వీడియో రిలీజ్ చేశారు. దీంతో తనకు ప్రాణహాని ఉందని, చంద్రహాస్‌పై చర్యలు తీసుకోవాలని జర్నలిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.