మంచు విష్ణుపై మరోసారి మనోజ్ ఫిర్యాదు
NEWS Apr 08,2025 07:43 pm
మంచు ఫ్యామిలీ వివాదం మరింత రాజుకుంటోంది. మరోసారి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు మంచు మనోజ్. తన సోదరుడు మంచు విష్ణుపై ఫిర్యాదు చేశారు. తాను ఇంట్లో లేనప్పుడు కార్లతో పాటు వస్తువులను ఎత్తుకు వెళ్లారంటూ ఆరోపించారు. జల్ పల్లిలోని ఇంట్లో కూడా 150 మంది చొరబడ్డారని, విధ్వంసం సృష్టించారంటూ మండిపడ్డారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరాడు.