కల్వర్ట్, రోడ్డు పనుల పరిశీలన
NEWS Dec 14,2024 08:28 am
ఆర్మూర్ నుంచి ఆలూరు వెళ్లే రోడ్డులో కల్వర్టు, రోడ్డు మరమ్మతుల పనులను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. కల్వర్టు, రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు రోడ్డును అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. పనుల్లో నాన్యత ప్రమాణాలు పాటించాలని, వేగంగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ కు ఆదేశించారు.