హైదరాబాద్, జూన్ 20 (Media Boss Network): బాలికల విద్యాభివృద్ధి, మహిళా సాధికారత లక్ష్యంగా ఏర్పాటైన “పండు శేషగిరి మెమోరియల్ ఫౌండేషన్” అధికారిక లోగోను తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హైదరాబాద్లోని తన ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ ఫౌండేషన్ను ప్రిన్సీ సెల్సియా తన తండ్రి దివంగత పండు శేషగిరి రావు స్మారకార్థం స్థాపించారు. బాలికల విద్యపై అవగాహన పెంపొందించడం, వారి విద్యాభివృద్ధికి సహకారం అందించడం, మహిళల సాధికారతకు ప్రోత్సాహం కల్పించడం సంస్థ ప్రధాన లక్ష్యాలని నిర్వాహకులు తెలిపారు.

దివంగత పండు శేషగిరి రావు జయంతి సందర్భంగా లోగో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం ప్రత్యేకతగా నిలిచింది. ఈ సందర్భంగా ఫౌండేషన్ చేపట్టిన సేవా కార్యక్రమాలను స్పీకర్ అభినందించారు. సమాజ అభివృద్ధికి బాలికల విద్య అత్యంత కీలకమని, వారి విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని ఆయన సూచించారు.
పలువురు ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఫౌండేషన్ సేవా దృక్పథాన్ని ప్రశంసించారు. బాలికల విద్య, మహిళా సాధికారత, సామాజిక అవగాహన కార్యక్రమాల ద్వారా సమాజంలో సానుకూల మార్పులు తీసుకురావడంలో ఈ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
పండు శేషగిరి మెమోరియల్ ఫౌండేషన్ భవిష్యత్తులో బాలికల విద్య, అవగాహన, మహిళా సాధికారత, సామాజిక అభివృద్ధి కోసం పలు కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
—



