లహుజీ సాళ్వె జీవిత చరిత్ర పుస్తకాన్ని ప్ర‌భుత్వం నుంచి ప్రచురించినందుకు

హైదరాబాద్ / ఆదిలాబాద్: ప్రథమ స్వాతంత్య్ర‌ సమరయోధుడు, ‘గురువులకే గురువు’గా పేరొందిన లహుజీ సాళ్వె జీవిత చరిత్రను ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రచురించడం పట్ల మాంగ్ సమాజ్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ జిల్లా ఇన్‌చార్జి, రాష్ట్ర పర్యాటక & సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని మాంగ్ సమాజ్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు గాడేకర్ పరశురామ్ మాంగ్ మర్యాదపూర్వకంగా కలిశారు. లహుజీ సాళ్వె చరిత్రను పుస్తక రూపంలో తెచ్చినందుకు మంత్రికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తొలిసారిగా తెలుగులో…
‘క్రాంతిపిత గురువర్య లహుజీ సాళ్వె’ పేరుతో ప్రభుత్వం ద్వారా తొలిసారిగా ఈ జీవిత చరిత్రను తెలుగులో ప్రచురించడం విశేషం. మాంగ్ సమాజ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గాయక్వాడ్ తులసీదాస్ మాంగ్ ఈ గ్రంథాన్ని మరాఠీ/మూల భాష నుండి తెలుగులోకి అత్యంత ప్రతిభావంతంగా అనువదించారు.

ఈ సందర్భంగా మాంగ్ సమాజ్ ప్రతినిధులు మాట్లాడుతూ, మహనీయుల చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం అభినందనీయమన్నారు. ఆ తర్వాత మాంగ్ సమాజ్ ప్రజలు మరియు భోసారా గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కొరకు వినతిపత్రంను మంత్రి గారికి అందించగా, వారు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో భోసారా సర్పంచ్ గొట్ముక్లే సుభాష్ మాంగ్, గొట్ముక్లే ప్రభాస్ మాంగ్, దీపక్‌తో పాటు పలువురు సమాజ ప్రముఖులు పాల్గొన్నారు.