త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న “అదే నీవు అదే నేను”
“కమిటీ కుర్రోళ్లు” ఫేమ్ త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, “సిద్ధార్థ్ రాయ్” ఫేమ్ తన్వీ నేగి, సహర్ కృష్ణన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ “అదే నీవు అదే నేను”. శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్ బ్యానర్‌పై కాండ్రేగుల గోవిందు నిర్మిస్తున్న ఈ చిత్రానికి యువ దర్శకుడు కొండల్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది.
ఈ సందర్భంగా చిత్రంలోని తొలి మెలోడీ ‘మనసా మనసా’ పాటను స్టార్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేశారు. ప్రముఖ సంగీత సంస్థ ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుని పాటలను విడుదల చేస్తోంది. చిత్రంలోని సంగీతం నచ్చడంతో ఆదిత్య మ్యూజిక్ ఈ చిత్ర ఆడియో విడుదలకు ముందుకొచ్చిందని చిత్రబృందం తెలిపింది.
పాటను విడుదల చేసి తమ చిత్రానికి ప్రోత్సాహం అందించిన దర్శకుడు వి.వి. వినాయక్‌కు నిర్మాత కాండ్రేగుల గోవిందు, దర్శకుడు కొండల్ కృతజ్ఞతలు తెలిపారు.
వి.వి. వినాయక్ మాట్లాడుతూ…
“కొండల్ తొలి ప్రయత్నంగా ‘అదే నీవు అదే నేను’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా ఆయనకు మంచి గుర్తింపు తీసుకురావాలని కోరుకుంటున్నాను. నిర్మాత గోవిందు గారికి ఇది తొలి చిత్రం. ఈ సినిమా విజయంతో ఆయన మరిన్ని మంచి చిత్రాలు నిర్మించాలని ఆశిస్తున్నాను. ‘మనసా మనసా’ పాట చాలా బాగుంది. చిత్రబృందం అందరికీ నా శుభాకాంక్షలు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
ఆకట్టుకుంటున్న ‘మనసా మనసా’ మెలోడీ
‘మనసా మనసా’ పాటను దర్శకుడు కొండల్ ఎంతో అందంగా, అభిరుచికి తగ్గట్టుగా చిత్రీకరించారు. రొమాంటిక్ భావోద్వేగాలను ఎక్కడా అసభ్యతకు తావులేకుండా కవితాత్మకంగా ఆవిష్కరించడం ఈ పాట ప్రత్యేకత. పూర్ణాచారి అందించిన సాహిత్యం హృదయాన్ని హత్తుకునేలా ఉండగా, సంగీత దర్శకుడు కనిష్క మళ్లీ మళ్లీ వినాలనిపించే మధురమైన స్వరాన్ని సమకూర్చారు. ప్రముఖ గాయకుడు జావేద్ అలీ తన ప్రత్యేకమైన గానశైలితో పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చారు.
కొరియోగ్రాఫర్ వేద రూపొందించిన అందమైన డ్యాన్స్ మూమెంట్స్, హీరో-హీరోయిన్లు త్రినాథ్ వర్మ, తన్వీ నేగి మధ్య కనిపించే సహజమైన కెమిస్ట్రీ, డీవోపీ నిమ్మల జయపాల్ రెడ్డి అందించిన రంగులమయమైన విజువల్స్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
పాటలోని కొన్ని ఆకట్టుకునే పంక్తులు:
“ఎన్నెన్నె వర్ణాలు ఉన్నా… నువ్వు లేని వెలితేదో మిగిలున్నదే…
మారిందే వరసా… నీకైనా తెలుసా… ఈ కొత్త గమ్మత్తు బాగున్నదే…
తుళ్లిపడకే మనసా… మనసా…
ఉన్నట్టుండి వెతికే మలుపే దొరికే… మరలా ప్రణయాలు మొదలయ్యెనే…
నీకు నాకు ముందే రాసి ఉంచారేమో… నిన్ను వీడి పోలేనులే…”
అంటూ ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగే ఈ మెలోడీ ఇప్పటికే ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

నటీనటులు
త్రినాథ్ వర్మ, యశ్వంత్ పెండ్యాల, తన్వీ నేగి, సహర్ కృష్ణన్, కల్పలత, సునయన, బిత్తిరి సత్తి, మీర్, సూర్యతేజ, నరేందర్, రమణ భార్గవ్ తదితరులు.
సాంకేతిక బృందం
- బ్యానర్: శ్రీ లక్ష్మీ వీరభద్ర క్రియేషన్స్
- నిర్మాత: కాండ్రేగుల గోవిందు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండల్
- సంగీతం: కనిష్క
- డీవోపీ: నిమ్మల జయపాల్ రెడ్డి
- ఎడిటర్: ఛోటా కె. ప్రసాద్
- ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్
- సాహిత్యం: పూర్ణాచారి
- డైలాగ్స్: వై. అమ్మిరాజు
