ఏటూరునాగారం ఏజెన్సీ ప్రాంతంలోని 10వ తరగతి విద్యార్థుల కోసం DNR ట్రస్ట్ చైర్మన్ దొడ్డ ప్రతాపరెడ్డి చేపట్టిన ‘విజయపథం’ స్టడీ మెటీరియల్ ఉచిత పంపిణీ కార్యక్రమంపై మండల విద్యాధికారి (MEO)తో పాటు మండల ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా MEO మాట్లాడుతూ,“ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇలాంటి ప్రామాణికమైన స్టడీ మెటీరియల్ ఎంతో అవసరం. ఏజెన్సీ ప్రాంత విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ, వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు నిరంతరం తోడ్పడుతున్న దొడ్డ ప్రతాపరెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు,” అని తెలిపారు.

రామన్నగూడెం, ఏటూరునాగారం, ముప్పనపల్లి, గుర్రేవుల, వెంకటాపురం, అలుబాక, వాజేడు నాగారం జెడ్పీహెచ్ఎస్ పాఠశాలల విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ పంపిణీ చేశారు. ఇది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఉపాధ్యాయులు పేర్కొన్నారు.నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ, ముఖ్యంగా విద్యారంగానికి DNR ట్రస్ట్ అందిస్తున్న ఈ సహకారం మరువలేనిదని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డా. రామయ్య, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రామన్నగూడెం ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.