▪️ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యంపై లోతైన సమాలోచన
హైదరాబాద్: అమెరికా తెలుగు అసోసియేషన్ (ATA) ఆధ్వర్యంలో సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో ATA అంతర్జాతీయ సాహిత్య సదస్సు–2025 ఘనంగా జరిగింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత, ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా సాహిత్యం ప్రధాన అంశంగా ఈ సదస్సులో విస్తృత స్థాయి సమాలోచన సాగింది. హిందీ–తెలుగు భాషల సాహిత్య శక్తిని ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నంగా ఈ సదస్సు నిలిచింది.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ నందిని సిధారెడ్డి, హైదరాబాద్ బుక్ ఫెయిర్ చైర్మన్, ప్రముఖ కవి యాకూబ్ ప్రారంభించగా, ATA సాహిత్య వేదిక చైర్ వేణు నక్షత్రం సభకు అధ్యక్షత వహించారు. ATA అధ్యక్షుడు జయంత్ చల్లా, ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి, ఇతర ATA ప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ, తెలుగు భాష–సంస్కృతుల పరిరక్షణలో ATA కీలక పాత్ర పోషిస్తోందని ప్రశంసించారు. అమెరికాలో ‘అమెరికా భారతి’ పేరుతో మాస పత్రికను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తూ తెలుగు భాషపై ప్రేమను చాటుతోందని, యువతలో తెలుగు అభ్యాసానికి అన్ని విధాల సహకారం అందిస్తోందని పేర్కొన్నారు. సాహిత్య రంగంలో కృషి చేసిన వారిని గుర్తించి పురస్కారాలతో సత్కరించడం ATA ప్రత్యేకతగా నిలుస్తోందన్నారు.


సదస్సులో‘జ్ఞానపీఠ పురస్కారాలలో మన తెలుగు వెలుగులు’ అంశంపై ఆచార్య డా. కొలకలూరి ఇనాక్, ‘మధ్యతరగతి జీవన విధానానికి ప్రతీకలు వినోద్ కుమార్ శుక్లా నవలలు’ పై డా. పిరిసెట్టి శ్రీనివాసరావు, ‘శుక్ల రచనల్లో ప్రకృతి చిత్రీకరణ’ పై డా. ఆర్. సుమన్ లత, ‘శుక్ల నవలల్లో జీవన దృష్టి’ పై ప్రొఫెసర్ సర్రాజ్, ‘శుక్ల నవలల్లో మధ్యతరగతి జీవితం’పై శ్రీనివాస్ గౌడ్, ‘శుక్ల కవిత్వం వాస్తవికత’పై రూప్ కుమార్ డబ్బికార్, ‘శుక్ల సాధారణతలోని కవితాత్మకత’ పై వారాల ఆనంద్, ‘శుక్ల సినిమా సాహిత్యం’పై రెంటాల జయదేవ్ తమ విశ్లేషణలు వినిపించారు. ముగింపు వేడుకల్లో రవీందర్ రెడ్డి, జ్యోత్స్న రెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించగా, ATA బోర్డు సభ్యులు, ATA ఇండియా టీం సభ్యులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ATA అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ, సాహితీవేత్తలు, వక్తలు, నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎలెక్ట్ ప్రెసిడెంట్ సతీష్ రామసహాయం రెడ్డి మాట్లాడుతూ, సాహిత్యానికి ATA ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ATA బోర్డు ఆఫ్ ట్రస్టీలు, కో-చైర్లు నరసింహ ద్యాసాని, సాయి సూదిని, శ్రీకాంత్ గుడిపాటి, కాన్ఫరెన్స్ కన్వీనర్ శ్రీధర్ బాణాల, మాజీ అధ్యక్షులు పరమేష్ భీమ్ రెడ్డి, బిజినెస్ చైర్ హరీష్ బత్తిని, రఘువీర్ మర్రిపెద్ది, వినోద్ కోడూరు, కిషోర్ గూడూరు, నర్సి రెడ్డి, విష్ణు మాధవరం, సుమ ముప్పల, తిరుమల్ రెడ్డి, రాజ్ కరకల, లక్ష్ చేపూరి, సుమన్ బర్ల, వేణుగోపాల్ సంకినేని, ATA ఇండియా కో-ఆర్డినేటర్ అమృత్ ముళ్ళపూడి, సూర్యచంద్ర రెడ్డితో పాటు పలువురు సాహితీవేత్తలు, కవులు, సాహిత్య అభిమానులు పాల్గొన్నారు.
